ePaper
Friday, October 9, 2026
ePaper
Homeతెలంగాణచంద్రయాన్" సినిమా సెన్సార్ పూర్తి.

చంద్రయాన్” సినిమా సెన్సార్ పూర్తి.

📰 Generate e-Paper Clip

చంద్రయాన్” సినిమా సెన్సార్ పూర్తి.

హైదారాబాద్:అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 9.

రాజు వెడ్స్ రాంబాయి సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో “చంద్రయాన్” టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్

ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్

చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కిన “చంద్రయాన్” సినిమా ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బృందం యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సరికొత్త కథా కథనాలతో మంచి ఎంటర్ టైనింగ్ సినిమా

చేశారంటూ సెన్సార్ టీమ్ ప్రశంసించారు. ఇటీవలే రిలీజ్ చేసిన “చంద్రయాన్” చిత్ర గ్లింప్స్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నెల 30న థియేటర్స్ లో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న అడ్వెంచర్ ఫన్ మూవీ

చూడబోతున్నామనే ఇంప్రెషన్ ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో కలుగుతోంది.
నటీనటులు – శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ, తదితరులు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!