ePaper
Thursday, October 8, 2026
ePaper
Homeతెలంగాణవిద్యుత్ కోతలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులు:

విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులు:

📰 Generate e-Paper Clip

విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులు:

భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, అక్టోబర్ 8:

భీమారం మండల కేంద్రంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు గురువారం నిర్వహించిన భారీ రాస్తారోకోతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
​మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు, ఆవడం ఎక్స్-రోడ్డు నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి కరెంట్ కోతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.
మంచిర్యాల జిల్లా​బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ బాల్క సుమన్ ఆదేశాల మేరకు భీమారం మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. రైతుల పక్షాన నిలిచి పోరాటం చేసిన నాయకులు.. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
​
​రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అనంతరం డివిజనల్ ఇంజనీర్ తో ఫోన్‌లో సంప్రదించి, ప్రస్తుతం సరఫరా చేస్తున్న కరెంట్‌కు అదనంగా మరో 4 గంటల విద్యుత్‌ను అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారుల నుంచి హామీ లభించడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. దీంతో జాతీయ రహదారిపై రవాణా సాధారణ స్థితికి చేరుకుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!