నడిరోడ్డుపై మహిళ హత్య,
పల్నాడు:అర్జున్ సమాచార ప్రతినిధి ఆగస్టు 8.
పిడుగురాళ్ళ పట్టణ నడిరోడ్డుపై మహిళ హత్యకు గురయింది. .. అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామం నుండి తమ్మిశెట్టి.సుజాత(35)పిడుగురాళ్ళ పట్టణ శివారులోని ఆదర్శకాలనీలోని చుట్టాల ఇంటికి వెళ్ళెందుకు పోలీస్ స్టేషన్ ఎదుట ఆటో ఎక్కుతున్న సమయంలో హత్య జరిగింది. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బత్తుల గోవిందు అనే వ్యక్తి మహిళపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అతికిరాతకంగా కత్తితో దాడి చేయడంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అడ్డు వచ్చిన దేవళ్ళ పార్వతమ్మపై కూడా దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడుని పిడుగురాళ్ల పోలీసులు పట్టుకున్నారు.

