మాన్విక్ ఫార్మసీ & సన్రైజ్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యం భీమారంలో విజయవంతంగా ఉచిత మెగా వైద్య శిబిరం:
200 మందికి పైగా రోగులకు ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ
భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 05:
భీమారం గ్రామ పంచాయతీ పరిధిలో మాన్విక్ ఫార్మసీ డాక్టర్ రంజిత్ కుమార్ (ఫార్మ్. డి ) వారి ఆధ్వర్యంలో, కరీంనగర్ సన్రైజ్ హాస్పిటల్స్ వారి విశేష సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మేగా వైద్య శిబిరం అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిసింది. ఈ వైద్య శిబిరానికి స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
శిబిరంలో గ్రామానికి చెందిన సుమారు 200 మందికి పైగా ప్రజలకు ఉచితంగా గుండె (ఈసీజీ), రక్తపోటు (బీపీ), మరియు మధుమేహం (షుగర్) పరీక్షలు నిర్వహించారు. వ్యాధి తీవ్రత ఆధారంగా రోగులకు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు.
డాక్టర్ రంజిత్ కుమార్ (ఫార్మ్. డి) గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, వైద్య టెక్నాలజీ అందించడానికి భీమారం లో ఉంటూ క్లినికల్ ఫార్మసీ, పేషెంట్ కౌన్సిలింగ్ సేవలందిస్తుండడం మాకు ఎంతో అభినందనీయమని మరియు గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇటువంటి మరెన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి సేవలందించడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది అని స్థానిక ప్రజలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రంజిత్ కుమార్ (ఫార్మ్. డి), సన్రైజ్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ రమణి, డాక్టర్ భిక్షపతి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కొప్పుల ప్రశాంత్, గోగు శ్రీనివాస్, క్యాంప్ కో-ఆర్డినేటర్ సతీష్, ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది, మరియు గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

