ePaper
Monday, October 12, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్భూభారతిలో అక్రమాలకు పచ్చజెండా.. సక్రమ పట్టాలకు నో ఎంట్రీ!నిషేధిత భూమికి రిజిస్ట్రేషన్ ఎలా?మార్కెట్ విలువ తగ్గింపుపై...

భూభారతిలో అక్రమాలకు పచ్చజెండా.. సక్రమ పట్టాలకు నో ఎంట్రీ!నిషేధిత భూమికి రిజిస్ట్రేషన్ ఎలా?మార్కెట్ విలువ తగ్గింపుపై విచారణ జరపాలి,కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మంథని రాజగోపాల

📰 Generate e-Paper Clip

భూభారతిలో అక్రమాలకు పచ్చజెండా.. సక్రమ పట్టాలకు నో ఎంట్రీ!నిషేధిత భూమికి రిజిస్ట్రేషన్ ఎలా?మార్కెట్ విలువ తగ్గింపుపై విచారణ జరపాలి,కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మంథని రాజగోపాల

అర్జున్ సమాచారం // అక్టోబర్ 12 // మంథని డెస్క్:

భూభారతి పోర్టల్‌లో భూముల రికార్డుల నిర్వహణ, నిషేధిత భూముల జాబితా, రిజిస్ట్రేషన్లు, మార్కెట్ విలువల నిర్ధారణపై అనేక అనుమానాలు ఉన్నాయని మంథనికి చెందిన రాజగోపాల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నిషేధిత జాబితాలో ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని ప్రశ్నించిన ఆయన.. మరోవైపు సక్రమమైన భూములకు సంబంధించిన సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని నిలదీశారు.

మంథని గ్రామంలోని సర్వే నంబర్ 94/బి, ఇంటి నంబర్ 2-5/ఏకు సంబంధించిన భూముల వ్యవహారంలో 1992 నాటి కట్టడాలు, ఇంటి రికార్డులు, డాక్యుమెంట్ నంబర్ 788/1982 వివరాలను ప్రస్తావిస్తూ పలు సందేహాలు వ్యక్తం చేశారు. అదే ప్రాంతంలోని సర్వే నంబర్ 94/డి భూమి నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఆరోపించారు. సుమారు 40 సెంట్ల భూమికి సంబంధించిన రికార్డులు, నిషేధిత జాబితా వివరాలను పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని కోరారు.

మార్కెట్ విలువలో వ్యత్యాసంపై అనుమానాలు

సంబంధిత భూమి మార్కెట్ విలువ సుమారు రూ.82 లక్షలు ఉండగా, ఖాతా నంబర్ 61183కు సంబంధించిన 0.0526 గుంటల విస్తీర్ణానికి రూ.5.60 లక్షలుగా విలువ చూపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.5,62,500 విలువ ఆధారంగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగినట్లు రాజగోపాల్ ఆరోపించారు. భూమి వాస్తవ మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకున్నారా? తక్కువ విలువతో రిజిస్ట్రేషన్ జరిగితే ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లిందా? అనే అంశాలపై అధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

రికార్డుల మార్పులపై విచారణ జరపాలి

భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో నిబంధనలు పాటించారా? సంబంధిత అధికారుల అనుమతులు తీసుకున్నారా? అనే అంశాలను పరిశీలించాలని రాజగోపాల్ కోరారు. కలెక్టర్ లాగిన్ ద్వారా భూముల వివరాల్లో మార్పులు జరిగాయన్న ఆరోపణలపై సాంకేతిక రికార్డులను పరిశీలించి నిజానిజాలు తేల్చాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, మంథని పరిధిలోని సర్వే నంబర్ 1112/ఏ, బి, సి, డి పరిధిలో ఉన్న రెండు ఎకరాల భూమికి సంబంధించి డాక్యుమెంట్ నంబర్ 2209/2011, పట్టా వివరాలు, 26-08-2020న సమర్పించిన ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌/2020/1 దరఖాస్తు అంశాలను కూడా ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలిపారు. సంబంధిత భూమి రికార్డులు, దరఖాస్తు స్థితి, రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

భూభారతి పోర్టల్‌లో భూముల రికార్డుల నిర్వహణ, నిషేధిత జాబితాలో మార్పులు, మార్కెట్ విలువల నిర్ధారణపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని రాజగోపాల్ విజ్ఞప్తి చేశారు. అర్హులైన భూ యజమానులకు న్యాయం చేయడంతోపాటు, నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల అధికారిక వివరణ, విచారణ ఫలితాలు వెలువడాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!