అక్వాన్ తుపానుపై ఐఎండీ తాజా హెచ్చరిక..!
వైజాగ్: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 19.
నర్సాపూర్–పూరి మధ్య గోపాల్‌పూర్‌కు తూర్పున తీరం దాటే అవకాశం.. విశాఖ లోతట్టు ప్రాంతాలకూ సముద్రపు నీటి ముప్పు.బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను ‘అక్వాన్’ ఉత్తరం వైపు కదులుతోంది. నవంబర్ 19 ఉదయం 8:30 గంటల పరిశీలన ప్రకారం గంటకు 15 కి.మీ వేగంతో కదులుతూ 14.9° ఉత్తర అక్షాంశం, 85.3° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది.ఆ సమయంలో నర్సాపూర్‌కు 420 కి.మీ, కళింగపట్నానికి 400 కి.మీ, గోపాల్‌పూర్‌కు 490 కి.మీ, పూరీకి 550 కి.మీ దూరంలో ఉన్నట్లు బులెటిన్ పేర్కొంది.తుపాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 20 మధ్యాహ్నం నాటికి ఉత్తరాంధ్ర–యానాం, దక్షిణ ఒడిశా తీరాల మధ్య నర్సాపూర్–పూరి పరిధిలో, గోపాల్‌పూర్‌కు తూర్పువైపున తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 90–100 కి.మీ వేగంతో, గరిష్ఠంగా 110 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.ఉత్తర కోస్తాంధ్రలో నవంబర్ 19, 20 తేదీల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.తీరప్రాంత ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.

