ఉచిత మెగా పశు వైద్య శిబిరానికి విశేష స్పందన.
తిరుపతి: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 19.
రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో నేడు రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పొదుపు సంఘాల సంచాలకులు నాగరాజు ఆదేశాల ప్రకారం రాస్ మహిళా పొదుపు సంఘాల కుటుంబ సభ్యుల సౌకర్యార్థం కరకంబాడి బ్రాంచ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రవి పర్యవేక్షణలో ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో డా. స్రవంతి వారి సహాయంతో పశువులకు వైద్య పరీక్షలు చేయడం జరిగింది. మొత్తం 42 పశువులకు గాను, 12 దూడలకు పిడుదులు, గోమార్లు, బొటాక్స్ మందులను స్ప్రే చేయడం జరిగింది, అలాగే 11 పశువులకు సాధారణ చికిత్సలు మరియు కట్టు ఇంజక్షన్లు 7 ఆవులకు వేయడం జరిగింది 12 ఆవులకు సులు పరీక్ష చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరం 16 కుటుంబాలకు ఉపయోగపడింది. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో పశువులకు తీసుకోవలసిన జాగ్రత్తలు, సీజనల్ వ్యాధులకు సంబంధించిన జాగ్రత్తల గురించి వెటర్నరీ డాక్టర్ స్రవంతి తెలియజేశారు. అనారోగ్య పశువులకు ఉచితంగా మందుల పంపిణీ చేశారు. ఈ శిబిరంలో రాస్ సిబ్బంది ప్రాజెక్ట్ ఆఫీసర్ రవి,అన్బలగన్ ,రామానుజులు, శంకరయ్య, స్వాతి, ఇందుమతి, పాల్గొన్నారు.

