అలగనూరు సభను విజయవంతం చేయాలి,కొప్పుల ఈశ్వర్.
పెద్దపల్లి: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 18.
నవంబర్ 29న దీక్షా దివస్ సందర్భంగా.. కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ నెల 29వ తేదీన కరీంనగర్ సమీపంలోని అలుగునూరు ప్రాంతంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరావాలని కోరుతున్నామని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు మూల కారణమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్ష మరియు ఆనాడు ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రజలకు మరోసారి గుర్తుచేయడానికి ఈ సభను అత్యంత ఘనంగా జరుపుతున్నాం. కేసీఆర్ సచ్చుడో… తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో ఆనాడు ఆయన తీసుకున్న పటిష్టమైన నిర్ణయం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అందుకే ఆ చారిత్రక అంశాన్ని నేటి తరానికి, ప్రజలందరికీ వివరించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశ్యం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం సజావుగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయని అన్నారు.
రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు, నిరంతర విద్యుత్ సరఫరా మరియు యూరియా పంపిణీ సరిగ్గా జరగడం లేదు. కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు బోనస్, రైతుబంధు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తోంది. “ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం, మూడు పంటలకు రైతుబంధు ఇస్తాం” అని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు ఇప్పుడేమయ్యాయి? రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించేంతవరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితమైన ఉద్యమ కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఉప్పు రాజ్ కుమార్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

