ePaper
Wednesday, November 18, 2026
ePaper
Homeతెలంగాణఅర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

📰 Generate e-Paper Clip

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ నగదు జమ
 రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.

గోదావరిఖని: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 18.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. బుధవారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నూతన పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్.

కాపీల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులందరికీ నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సాయంత్రంలోపు నేరుగా

వారి బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ అవుతుందని తెలిపారు. రాబోయే మూడేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లిస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తోందని అన్నారు. ఇప్పటికే అర్హులైన వారికి రేషన్,

కార్డులు అందించామని, దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు.
అంతేకాకుండా సహజ మరణం సంభవించిన సందర్భంలోనూ రూ.5 లక్షల బీమా అందించేలా ప్రభుత్వం రూ.3,000 కోట్లతో ప్రత్యేక బీమా పథకాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు.
రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట
గోదావరిఖనిలో రూ.12.50 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం, రూ.40 కోట్లతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరు వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. రామగుండం

నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారు రూ.1,000 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని, ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అధికారులు,

పెద్ద సంఖ్యలో పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!