ePaper
Monday, November 9, 2026
ePaper
Homeతెలంగాణబీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు.. కడెం మండలం నుంచి 300 మందికి పైగా గులాబీ, గూటికి....కండువాలు కప్పి...

బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు.. కడెం మండలం నుంచి 300 మందికి పైగా గులాబీ, గూటికి….కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూక్యా జాన్సన్ నాయక్ గారు.

📰 Generate e-Paper Clip

బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు.. కడెం మండలం నుంచి 300 మందికి పైగా గులాబీ, గూటికి….కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూక్యా జాన్సన్ నాయక్ గారు.

జన్నారం:  అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 8,

ఖానాపూర్ నియోజకవర్గం కడెం మండలం కొండుకూర్ ఎస్‌కే ఫంక్షన్ హాల్‌లో ఈరోజు కడెం మండల బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు 300 మంది, మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారు గులాబీ ఖండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ గారు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. అందరికి అందుబాటులో ఉంటూ తన కట్టే కాలే వరకు ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

కేసీఆర్ గారి నాయకత్వంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలైన రైతు సంక్షేమ పథకాలు, రైతులకు కల్పించిన భరోసాను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలిచాయని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పెట్టుబడి సాయం, సాగునీరు, విద్యుత్ సరఫరా, పంటలకు గిట్టుబాటు ధరలు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల కష్టాలు, ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం గళమెత్తడమే రైతు గర్జన సభ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.

ఈ నెల 11న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి రైతు గర్జన సభను విజయవంతం చేయాలని నూతనంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

రైతులకు అండగా నిలిచింది కేసీఆర్ గారే.. రైతుల గోసను వినిపించేందుకు రైతు గర్జన సభకు మేమంతా కదలివస్తాం.. మేమంతా కేసీఆర్ వెంటే అనే నినాదంతో సభకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో కడెం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!