ePaper
Monday, September 21, 2026
ePaper
Homeతెలంగాణఆసుపత్రిలో జిల్లా ప్రధాన కార్యదర్శి తోట చంద్రయ్యను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు.

ఆసుపత్రిలో జిల్లా ప్రధాన కార్యదర్శి తోట చంద్రయ్యను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు.

📰 Generate e-Paper Clip

ఆసుపత్రిలో జిల్లా ప్రధాన కార్యదర్శి తోట చంద్రయ్యను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు.

అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 20 | కరీంనగర్ డెస్క్.

కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట చంద్రయ్య, పన్నూరు గ్రామానికి చెందిన తడక శ్రీనివాస్ గుండె సంబంధిత శస్త్రచికిత్స అనంతరం కరీంనగర్‌లోని అపోలో రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు.

ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి, వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో. మాజీ జెడ్పిటిసి మైదo భారతి -వరప్రసాద్.పన్నూరు గ్రామ మాజీ ఎంపీటీసీ ముస్త్యాల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ చిందం మహేష్, రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత్కూరి అవినాష్ గౌడ్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి అరెల్లి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!