ePaper
Monday, November 9, 2026
ePaper
Homeఎడిటోరియల్దీపావళి పండుగ వేళ విషాదం.. ..రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి,బైక్‌ను ఢీకొన్న టిప్పర్.. భర్తకు తీవ్ర...

దీపావళి పండుగ వేళ విషాదం.. ..రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి,బైక్‌ను ఢీకొన్న టిప్పర్.. భర్తకు తీవ్ర గాయాలు.

📰 Generate e-Paper Clip

దీపావళి పండుగ వేళ విషాదం.. ..రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి,
బైక్‌ను ఢీకొన్న టిప్పర్.. భర్తకు తీవ్ర గాయాలు.

పండుగ కోసం స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు పిల్లలకు తీరని లోటు,

పెద్దపల్లి:అర్జున్ సమాచారం నవంబర్ 7 . డెస్క్.

ఎండపల్లి,  దీపావళి పండుగ వేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకునేందుకు స్వగ్రామానికి బైక్‌పై వస్తున్న దంపతులను టిప్పర్ ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటన ఎండపల్లి మండలం మారేడుపల్లి శివారులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తి గ్రామానికి చెందిన ఆవుల కృష్ణ తన భార్య ప్రణీతతో కలిసి గోదావరిఖని నుంచి దీపావళి పండుగ కోసం స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలోని ఎండపల్లి మండలం మారేడుపల్లి శివారుకు చేరుకోగానే వారు ప్రయాణిస్తున్న బైక్‌ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో ప్రణీతకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమించింది. ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు గాయపడిన భర్త కృష్ణను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కృష్ణ, ప్రణీత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీపావళి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందంగా గడపాలని ఆశతో స్వగ్రామానికి బయలుదేరిన ఆ దంపతులకు మార్గమధ్యంలోనే ప్రమాదం ఎదురుకావడం విషాదకరం. తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, తల్లి మృతిచెందడంతో ఇద్దరు చిన్నారులు తల్లికి దూరమయ్యారు. పండుగ పూట ఇంటికి చేరుకోవాల్సిన తల్లి విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
దీపావళి వేళ బొట్లవనపర్తి గ్రామంలో ఈ విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. పండుగ సంబరాల మధ్య చోటుచేసుకున్న ఈ ప్రమాదం గ్రామస్థులను కలచివేసింది. ఒక కుటుంబంలో తీరని శోకాన్ని నింపిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!