12 ఏళ్ల కిడ్నీ వ్యాధితో పోరాటం.. .మార్పిడి శస్త్రచికిత్సతో కొత్త జీవితం
చికిత్స కోసం చేసిన అప్పులతో ఆర్థిక ఇబ్బందుల్లో నిరుపేద కుటుంబం.. .దాతల సహాయం కోసం ఎదురుచూపులు.
అర్జున్ సమాచారం ,నవంబర్ 7 .జన్నారం ప్రతినిధి.
మంచిర్యాల జిల్లా: జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన సేపూరి గోపాల్ గత 12 ఏళ్లుగా కిడ్నీ వ్యాధితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఆశతో గల్ఫ్ దేశమైన మస్కట్‌కు వలస వెళ్లి పనిచేసిన ఆయన, అక్కడ ఎదురైన అధిక పని ఒత్తిడి, తాగునీటి సమస్యలు తదితర పరిస్థితుల నేపథ్యంలో కిడ్నీ వ్యాధి బారినపడ్డారు. అప్పటి నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2014 నుంచి 2020 వరకు ప్రతి నెల సుమారు రూ.10 వేల విలువైన మందులు వినియోగిస్తూ చికిత్స పొందారు. అయినప్పటికీ వ్యాధి తీవ్రత తగ్గకపోవడంతో 2020 నుంచి 2026 వరకు డయాలసిస్‌పై ఆధారపడాల్సి వచ్చింది. రోజువారీ వైద్య చికిత్సలు, మందులు, ఇతర అవసరాల కోసం కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అయినా ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఆశతో చికిత్సను కొనసాగించారు.
ఈ క్రమంలో కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించడంతో 2023లో జీవన్‌దాన్ పథకంలో పేరును నమోదు చేసుకున్నారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2026 అక్టోబర్ 25న హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. దీంతో గోపాల్ జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి. ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న అనారోగ్య బాధల నుంచి బయటపడేందుకు మార్గం ఏర్పడింది.
అయితే ఒకవైపు అనారోగ్యంతో పోరాటం, మరోవైపు కుటుంబ బాధ్యతలు ఆ కుటుంబాన్ని మరింత కుంగదీశాయి. ఇద్దరు పిల్లల భవిష్యత్తు, కుటుంబ పోషణ భారంగా మారడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కష్టకాలంలోనూ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనే సంకల్పంతో 2022లో చిన్న కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని ద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబ అవసరాలను తీర్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో గోపాల్‌కు కొత్త జీవితం లభించినప్పటికీ, ఆర్థికంగా ఆ కుటుంబం ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉంది. గతంలో చికిత్స కోసం చేసిన అప్పులు, ప్రస్తుతం కొనసాగుతున్న వైద్య ఖర్చులు, మందుల అవసరాలు కుటుంబానికి పెనుభారంగా మారాయి. ఈ క్లిష్ట సమయంలో దాతల ఆర్థిక సహాయం అందించాలని మనసు పూర్తిగా కోరుసున్నాము.
శస్త్రచికిత్స అనంతరం కూడా వైద్యుల సూచనల మేరకు నిరంతర చికిత్స, మందులు అవసరమయ్యే పరిస్థితి ఉండటంతో ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
దాతల చేయూతే కుటుంబానికి కొండంత అండ,
ఈ నేపథ్యంలో మానవత్వం కలిగిన దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, గల్ఫ్ ప్రవాస భారతీయులు, సేవాభావం కలిగిన వ్యక్తులు ముందుకొచ్చి సేపూరి గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించి ఇద్దరు పిల్లల భవిష్యత్తుకు, గోపాల్ తదుపరి వైద్య చికిత్సకు అండగా నిలవాలని కోరుతున్నారు.
ఆర్థిక సాయం పంప వలసిన phoePe/ Google pay:9999753990.

