ePaper
Tuesday, November 10, 2026
ePaper
Homeతెలంగాణచిట్టి చేతులతో మొక్క నాటిన చిన్నారి దేవ్యాన్ బాబు.

చిట్టి చేతులతో మొక్క నాటిన చిన్నారి దేవ్యాన్ బాబు.

📰 Generate e-Paper Clip

చిట్టి చేతులతో మొక్క నాటిన చిన్నారి దేవ్యాన్ బాబు.

పచ్చని భవిష్యత్తుకు తొలి అడుగు… .మనవడి చేతుల మీదుగా మొక్క నాటించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మరో తరం భాగస్వామ్యం.

మంథని, అర్జున్ సమాచారం ప్రతినిధి.నవంబర్ 09.

చిన్నతనంలోనే పిల్లల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రకృతిపై మమకారం కల్పించాలనే ,ఉద్దేశంతో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తన మనవడు దేవ్యాన్ బాబుతో మొక్క నాటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం మంథనిలోని తన స్వగృహమైన రాజగృహాలో తాతయ్య పుట్ట మధూకర్, నానమ్మ శైలజ, తల్లి కుషాలి సమక్షంలో చిన్నారి దేవ్యాన్ బాబు తన చిట్టి చేతులతో మొక్క నాటి అందరినీ ఆకట్టుకున్నాడు.

పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని బాధ్యతగా సంరక్షించాలనే సందేశాన్ని భావితరాలకు అందించేలా పుట్ట మధూకర్ దంపతులు తమ మనవడితో మొక్క నాటించడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, చిన్నతనం నుంచే పిల్లలకు ప్రకృతి ప్రాముఖ్యతను తెలియజేయాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలని పేర్కొన్నారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత కాపాడటంతో పాటు భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించవచ్చని తెలిపారు.

నేడు చిన్నారుల చేతులతో నాటిన మొక్కలు రేపటి రోజున మహావృక్షాలుగా ఎదిగి సమాజానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో గతంలో హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కల పెంపకానికి ప్రాధాన్యత కల్పించగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి కార్యక్రమాలు సైతం పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తున్నాయి. చిన్నారి దేవ్యాన్ బాబు మొక్క నాటిన ఈ కార్యక్రమం పచ్చదనం పట్ల చిన్నారుల్లోనూ బాధ్యతను పెంపొందించాలనే సందేశాన్ని చాటిచెప్పింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!