ePaper
Sunday, November 8, 2026
ePaper
Homeతెలంగాణఅంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు.

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు.

📰 Generate e-Paper Clip

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు.

కొరివి వేణుగోపాల్ పిలుపుతో స్పందించిన మంథని దళిత, బహుజన నాయకులు.

అర్జున్ సమాచారం నవంబర్ 8.మంథని డెస్క్.

మంథని:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ ప్రతి ఆదివారం ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ బహుజన నాయకులు, ప్రముఖ న్యాయవాది కొరివి వేణుగోపాల్ ఇచ్చిన పిలుపునకు మంథనిలో మంచి స్పందన లభించింది.

ఈ పిలుపు మేరకు ఆదివారం మంథని పట్టణంలో దళిత, బహుజన నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను, ఆయన సమాజానికి అందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలను తొలగించి, అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పోషించిన కీలక పాత్ర దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని కొనియాడారు.

అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు మాత్రమే కాదని, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతితో పాటు సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను మాటలకే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఆదివారం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమాన్ని కొనసాగించడం ద్వారా యువతలో రాజ్యాంగ విలువలు, సామాజిక చైతన్యం, అంబేద్కర్ ఆలోచనలపై అవగాహన పెంపొందించాలని నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు, పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి తగరం శంకర్ లాల్, బీసీ నాయకులు ఆకుల రాజబాపు, సీనియర్ దళిత నాయకులు అప్పాల పోషమల్లయ్య, ఎడ్ల కిష్టయ్య, కన్నూరి బాపన్న, మాజీ వైస్ ఎంపీపీ వేల్పుల గట్టయ్య, జంజర్ల గట్టయ్య, లింగయ్య, ధర్మేందర్, కోటయ్య, గడ్డం లక్ష్మీనారాయణ, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!