చికిత్స పొందుతున్న రమేష్‌ను పరామర్శించిన పుట్ట మధూకర్ దంపతులు.
అర్జున్ సమాచారం // అక్టోబర్ 5 // రామగిరి రిపోర్టర్.
కరీంనగర్‌లోని కియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రామగిరి మండలం లోంక కేసారం గ్రామానికి చెందిన మొసలి రమేష్‌ను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, శైలజ దంపతులు సోమవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా రమేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పుట్ట మధూకర్ దంపతులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం వైద్యులను కలిసి రమేష్‌కు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు.
రమేష్‌కు మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా అవసరమైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.

