ePaper
Monday, October 5, 2026
ePaper
Homeతెలంగాణమంథనిలో దళిత బంధు పథకం అమలు ఏమైంది?

మంథనిలో దళిత బంధు పథకం అమలు ఏమైంది?

📰 Generate e-Paper Clip

మంథనిలో దళిత బంధు పథకం అమలు ఏమైంది?

కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
రాష్ట్ర దళిత బంధు సాధన సమితి నాయకుల డిమాండ్.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 5 // మంథని రిపోర్టర్.

మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు లేదా అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా ఏ ఒక్క దళిత కుటుంబానికైనా ఆర్థిక సహాయం అందించిందా అని రాష్ట్ర దళిత బంధు సాధన సమితి నాయకులు ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోకిల మహేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గద్దల శంకర్, మంథని డివిజన్ దళిత బంధు అధ్యక్షుడు ఊట్ల శ్రీను మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గంలోని 100 దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున దళిత బంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించారని తెలిపారు.

దళితులు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేశారని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో దళితులకు అంబేద్కర్ అభయహస్తం ద్వారా రూ.12 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు మంథని నియోజకవర్గంలో ఎంతమంది దళితులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

దళితుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం సరికాదని వారు అన్నారు. మంథని నియోజకవర్గానికి చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దళితుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, హామీలను అమలు చేయాలని కోరారు.

సమావేశంలో రాష్ట్ర దళిత బంధు సాధన సమితి నాయకులు, మంథని డివిజన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!