గడిపెల్లి శ్రీనివాస్‌ను అభినందించిన పుట్ట మధూకర్.
అర్జున్ సమాచారం // అక్టోబర్ 3 // మంథని. డెస్క్.
మంథని పట్టణ మైత్రీ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన గడిపెల్లి శ్రీనివాస్‌ను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అభినందించారు. రెండు రోజుల క్రితం జరిగిన మైత్రీ ఆటో యూనియన్ ఎన్నికల్లో శ్రీనివాస్ అధ్యక్షుడిగా విజయం సాధించారు.
ఈ సందర్భంగా శనివారం మంథని పట్టణంలోని రాజగృహాలో శ్రీనివాస్‌ను పుట్ట మధూకర్ శాలువాతో సత్కరించి అభినందించారు. యూనియన్ అధ్యక్షుడిగా ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలకు తన పూర్తి సహకారం, అండదండలు ఉంటాయని పుట్ట మధూకర్ భరోసా ఇచ్చారు.

