ePaper
Monday, August 31, 2026
ePaper
Homeజగిత్యాలతెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాలలో ఘనంగా జరుపుకున్న రాఖీ పండుగ.

తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాలలో ఘనంగా జరుపుకున్న రాఖీ పండుగ.

📰 Generate e-Paper Clip

తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాలలో ఘనంగా జరుపుకున్న రాఖీ పండుగ

జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం ఆగస్టు 29:

ఉపాధి కోసం ఎడారి దేశం వచ్చిన గల్ఫ్ కార్మికులు తమ మధ్య ఉన్న సోదరభావాన్ని, ఆత్మీయతను చాటుకుంటూ దుబాయ్‌లో రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమన్న యూఏఈ దుబాయ్ శాఖ అధ్యక్షులు ఏరుకల రాజుగౌడ్ కు మరియు ఓమన్-మస్కట్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలజీ శ్రీనివాస్,ఓమన్ శాఖ అధ్యక్షులు జవుడాల సత్తన్న, కోఆర్డినేటర్ గోగు దేవరాజు, సౌదీ శాఖ ఆధ్వర్యంలో శాఖ అధ్యక్షులు ఉప్పు సురేష్, అక్కడ నివసిస్తున్న సోదరులకు ఒకరికి ఒకరు రాఖీ కట్టి తమలో ఉన్న సోదరాబావాన్ని వ్యక్తపరుస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు
​ఈ సందర్భంగా నాయకులు పత్రిక విలేకరులతో చరవాణిలో మాట్లాడుతూ పలు భావోద్వేగ విషయాలను పంచుకున్నారు ​స్వగ్రామాలకు దూరంగా ఆత్మీయ అనుబంధం పుట్టిన ఊరికి, కంటికి రెప్పలా చూసుకునే కుటుంబ సభ్యులకు వేల కిలోమీటర్ల దూరంలో జీవిస్తున్న గల్ఫ్ కార్మికులు ఈ రాఖీ పండుగ సందర్భంగా ఒకరికొకరు తోడుగా నిలిచారు సోదరభావానికి ప్రతీక అక్కాచెల్లెళ్ల చేతుల మీదుగా రాఖీ కట్టించుకోవాల్సిన పవిత్ర సందర్భంలో స్వగ్రామాలకు వెళ్లే అవకాశం లేక గల్ఫ్ దేశాల్లో ఉన్న తోటి కార్మికులే ఒకరికొకరు రాఖీలు కట్టుకుని తమ అనుబంధాన్ని చాటుకున్నారు ఆప్యాయతకు నిదర్శనం రాఖీ అంటే కేవలం ఒక దారం మాత్రమే కాదని అది ఆప్యాయత, అనుబంధం మరియు ఆత్మీయతకు ప్రతీక అని పేర్కొన్నారు ఐక్యతకు స్ఫూర్తి ఎడారి దేశంలో కష్టపడుతున్న కార్మికులకు పండుగ రోజులు ఆనందంతో పాటు కుటుంబ జ్ఞాపకాలను గుర్తు చేస్తాయని, అక్కాచెల్లెళ్ల కూతుళ్ళ ప్రేమను ప్రత్యక్షంగా ఆస్వాదించలేకపోవడం బాధాకరమైనప్పటికీ కుటుంబాలకు దూరమైనా మనసులకు దగ్గరగానే ఉన్నాయి అనే సందేశంతో ఈ వేడుకలు జరుపుకున్నామని తెలిపారు ​కుటుంబానికి దూరంగా ఉన్నా గల్ఫ్ కార్మికుల మధ్య ఈ రకమైన అనుబంధాన్ని సజీవంగా ఉంచుతూ జరుపుకున్న ఈ రాఖీ వేడుకలు అందరిలో సోదరభావం, ఐక్యత మరియు కొత్త స్ఫూర్తిని నింపాయని నాయకులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!