ePaper
Friday, October 30, 2026
ePaper
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు...రైల్వే స్టేషన్‌లో మారణహోమం,

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు…రైల్వే స్టేషన్‌లో మారణహోమం,

📰 Generate e-Paper Clip

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు…రైల్వే స్టేషన్‌లో మారణహోమం,

నీప్రో: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 30.

నిప్రో రైల్వే స్టేషన్‌పై రష్యా జెట్-పవర్డ్ డ్రోన్‌తో దాడి,14 మంది మృతి, మరో 14 మందికి తీవ్ర గాయాలు,ఉక్రెయిన్ వ్యాప్తంగా దాడుల్లో 20కి పైగా పౌరుల మృతి.

పౌరులనే లక్ష్యంగా చేసుకున్నారంటూ జెలెన్‌స్కీ ఆవేదన
రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపు.


ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. గురువారం ఉదయం నిప్రో నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌పై జెట్-పవర్డ్ డ్రోన్‌తో భీకర దాడికి పాల్పడింది. రద్దీగా ఉండే ప్లాట్‌ఫామ్‌ను లక్ష్యంగా చేసుకున్న

ఈ దాడిలో కనీసం 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా జరిగిన పలు దాడుల్లో మొత్తం మృతుల సంఖ్య 20 దాటింది. స్థానిక కాలమానం ప్రకారం.

ఉదయం 11 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. జపోరిజియా వెళ్లే ప్యాసింజర్ రైలు, మరో కమ్యూటర్ రైలు ప్లాట్‌ఫామ్‌పై ఉన్నప్పుడు ఈ దాడి చోటుచేసుకుంది. దాడికి ముందు హెచ్చరికలు జారీ.

చేసినప్పటికీ, చాలామంది పౌరులు అక్కడే ఉండటంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంపైకి రష్యా ప్రయోగించిన నాలుగు డ్రోన్లలో మూడింటిని ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలు

కూల్చివేయగా, ఒకటి రైల్వే స్టేషన్‌ను తాకిందని అధికారులు తెలిపారు. మృతుల్లో 11 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడని, ఓ వ్యక్తి తన రెండు కాళ్లను కోల్పోయాడని ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ హంజా

వెల్లడించారు. ప్లాట్‌ఫామ్‌పై మృతదేహాలు, రక్తపు మడుగులు, ధ్వంసమైన రైళ్లతో భయానక వాతావరణం నెలకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇదే రోజు ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా దాడులు.

చేసింది. చెర్నిహివ్ నగరంలో జరిగిన దాడిలో 15 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు మరణించారు. క్రెమెన్‌చుక్‌లో ఓ నివాస భవనంపై డ్రోన్ దాడి జరగడంతో ముగ్గురు చనిపోగా, 15 మంది గాయపడ్డారు.

దేశవ్యాప్తంగా ఈ దాడుల్లో గాయపడిన వారి సంఖ్య 50కి పైగా ఉన్నట్లు అంచనా. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ “అత్యంత భయంకరమైనది”గా అభివర్ణించారు.

సాధారణ ప్రయాణికులు, పౌరులు ఉండే రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు మరింత కఠినమైన ఆంక్షలు విధించాలని మరోసారి

పిలుపునిచ్చారు. అయితే, ఈ దాడికి తామే బాధ్యులమని రష్యా ప్రకటించలేదు. పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకోలేదని, సైనిక, రవాణా కేంద్రాలపైనే తమ దాడులు ఉంటాయని రష్యా వాదిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!