ePaper
Wednesday, November 25, 2026
ePaper
Homeతెలంగాణపేద ప్రజల భూములను గుంజుకోవడమే నీ తండ్రి ఆశ ఆశయాల ,శ్రీధర్ బాబు.BRS పార్టీ మండలాధ్యక్షుడు...

పేద ప్రజల భూములను గుంజుకోవడమే నీ తండ్రి ఆశ ఆశయాల ,శ్రీధర్ బాబు.BRS పార్టీ మండలాధ్యక్షుడు జోడు శ్రీనివాస్ ఆరోపణ.

📰 Generate e-Paper Clip

పేద ప్రజల భూములను గుంజుకోవడమే నీ తండ్రి ఆశ ఆశయాల ,శ్రీధర్ బాబు.BRS పార్టీ మండలాధ్యక్షుడు జోడు శ్రీనివాస్ ఆరోపణ.

మంథని:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 27.

గుమ్మల్లపల్లి గ్రామానికి చెందిన ఆదివాసి బిడ్డల యొక్క భూమిని దౌర్జన్యంగా నీ తమ్ముడు అనుచరుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసి వాళ్ల భూములను గుంజుకోవడం బాధాకరమని, అప్పట్లో ప్రభుత్వాలు సీలింగ్ యాక్ట్ ద్వారా ఒక వ్యక్తి పేరు మీద 50 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ఆ భూమిని ప్రభుత్వమే తీసుకొని పేద ప్రజలకు పంచే కార్యక్రమం చేసిందని ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నీ తండ్రి శ్రీపాదరావు భూములను కూడా తీసుకొని పేద ప్రజలకు పంచడం జరిగిందని ఈ భూములను పేద ప్రజల పేరు మీద పట్టాలు చేయకుండా దౌర్జన్యంగా గుంజుకోవడం చూస్తా ఉంటే మీ కాంగ్రెస్ నాయకులేమో మా శ్రీధర్ బాబు గారు మచ్చలేని నాయకుడు అని బయట గొప్పలు చెబుతా ఉంటే నువ్వు చేసే అటువంటి పనులు ఈ సమాజం తలదించుకునే విధంగా ఉంది అని,
తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కూడా లేనటువంటి గిరిజన ఆదివాసి బిడ్డల భూములను నీ తల్లి పేరు మీద పట్టా ఉంది .అని ఆ భూమిని గుంజుకొని వారు ఎన్నో సంవత్సరాల నుండి కాస్టులో ఉన్నప్పటికీ అధికారంలోకి రాగానే నీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ పేద ప్రజల భూములను గుంజుకోవడం మీ నియంత పాలనకు నిదర్శమనీ,
ఈ పేద కుటుంబానికి తిరిగి భూమి ఇవ్వకుంటే కాటారం మండలంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి వీరికి భూమి వచ్చే విధంగా పోరాటం చేయడం జరుగుతుంది అని కాటారం BRS పార్టీ మండల అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ గారు అన్నారు,
ఈ కార్యక్రమంలో ఆయన వెంట, ఆలం సత్యనారాయణ, పంతకాని సడవాలి, బాసాని రవి,, కొండగొర్ల వెంకటస్వామి, గాలి సడవాలి,చీర్ల తిరుపతి రెడ్డి, తొంబర్ల రమణ,,రామిల్ల రాజు,కొండపర్తి రవి, జిల్లెల శంకర్, తుటి మనోహర్, గాజుల విక్రమ్ కుమార్, మంథని అర్చన సమ్మయ్య,బొడ్డు రాజబాపు, శివరాపు శ్యామ్ సుందర్, రాంశెట్టి ఆంజనేయులు,,రత్న రమేష్ రెడ్డి, దానం సమ్మయ్య, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!