ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్జగిత్యాల జిల్లాలో కలకలం!జిల్లాలో ఏసీబీ పోలీసుల దాడి.

జగిత్యాల జిల్లాలో కలకలం!జిల్లాలో ఏసీబీ పోలీసుల దాడి.

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లాలో కలకలం!జిల్లాలో ఏసీబీ పోలీసుల దాడి.

జగిత్యాల ప్రతినిధి :అర్జున్ సమాచారం సెప్టెంబర్ 27::

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీడీపీఓ..
సీడీపీఓ పద్మ అరెస్ట్!

రూ.63,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అధికారి

మెట్పల్లి: అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

మెట్పల్లి పట్టణ సెక్టార్ పరిధిలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ఒక్కో కేంద్రానికి నెలకు రూ.1,000 చొప్పున.. మూడు నెలలకు రూ.3,000 చొప్పున మొత్తం రూ.63,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.

సెప్టెంబర్ 26న రూ.63,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు సీడీపీఓ పద్మను పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఆమెను అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!