ePaper
Tuesday, July 7, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్శతాధిక వృద్దురాలు నవనీతమ్మకు ప్రత్యేక విఐపి బ్రేక్ దర్శనం

శతాధిక వృద్దురాలు నవనీతమ్మకు ప్రత్యేక విఐపి బ్రేక్ దర్శనం

📰 Generate e-Paper Clip

శతాధిక వృద్దురాలు నవనీతమ్మకు ప్రత్యేక విఐపి బ్రేక్ దర్శనం
తిరుమల, అర్జున్ సమాచారం,జూలై 06
ఈ రోజు 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ,  ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం విజయవంతంగా కల్పించామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
తరువాత రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ  ముద్దాడ రవిచంద్ర  వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మ గారికి నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారని అన్నారు.
 ఈ సందర్భంగా నవనీతమ్మ రి మనవడు దిక్పతీ మాట్లాడుతూ,  “మా అమ్మమ్మ కోరికను నెరవేర్చి, మా కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీకి, టీటీడీ చైర్మన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు.”  అని తెలిపారు.
నవనీతమ్మ ను  గుర్తించడంలో తమ వంతు సహకారం అందించిన సోషల్ మీడియా మిత్రులందరికీ, అలాగే వెంటనే స్పందించి ఆమెను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక భక్తురాలి జీవితకాల కోరిక నెరవేరిన ఈ సందర్భం మా అందరికీ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందని అయన అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!