ePaper
Wednesday, November 18, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్విధుల్లో నిర్లక్ష్యం.. క్రమశిక్షణ ఉల్లంఘనపై కఠిన చర్యలు,ఐదుగురు సిబ్బంది పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్....మరో 09 మందిపై...

విధుల్లో నిర్లక్ష్యం.. క్రమశిక్షణ ఉల్లంఘనపై కఠిన చర్యలు,ఐదుగురు సిబ్బంది పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్….మరో 09 మందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు.

📰 Generate e-Paper Clip

విధుల్లో నిర్లక్ష్యం.. క్రమశిక్షణ ఉల్లంఘనపై కఠిన చర్యలు,ఐదుగురు సిబ్బంది పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్….మరో 09 మందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు.

బెల్లంపల్లి: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 18.

బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీస్ సిబ్బంది విధి సమయంలో బాధ్యతలను విస్మరించి, పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ డ్యాన్స్ చేయడంతో పోలీస్ శాఖ క్రమశిక్షణకు, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారు.ఈ ఘటనపై స్పందించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐదుగురు సిబ్బందిని పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ,మరో 09 మంది సిబ్బంది పై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సిబ్బందికి స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణతో పాటు బాధ్యతాయుతమైన విధి నిర్వహణ అత్యంత కీలకమని తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం సహించరాని విషయమని పేర్కొన్నారు. ప్రతి పోలీస్ సిబ్బంది శాఖ గౌరవ ప్రతిష్టలను కాపాడేలా వృత్తిపరమైన నిబద్ధతతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘన లేదా పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!