ePaper
Wednesday, October 14, 2026
ePaper
Homeతెలంగాణమొక్కులు తీర్చే మహిమాన్విత దుర్గమ్మ తల్లి.

మొక్కులు తీర్చే మహిమాన్విత దుర్గమ్మ తల్లి.

📰 Generate e-Paper Clip

మొక్కులు తీర్చే మహిమాన్విత దుర్గమ్మ తల్లి.

అమ్మవారికి రూ.11,500 విలువైన వెండి పట్టీలు సమర్పించిన బుద్ధర్తి విజయ దంపతులు,

అర్జున్ సమాచారం // అక్టోబర్ 14 // రామగిరి రిపోర్టర్:

మంథని మండలం లద్నాపూర్ గ్రామంలోని శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గత 14 సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో కొలువుదీరుతున్న దుర్గమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ సర్పంచ్ బుద్ధర్తి బుచ్చయ్య రామయ్య పల్లె ఉపసర్పంచ్ బుద్ధర్తి విజయ దంపతులు అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నారు. తమ కోరిక నెరవేరడంతో సుమారు రూ.11,500 విలువైన వెండి పట్టీలను దుర్గమ్మ తల్లికి సమర్పించారు.

ఈ సందర్భంగా విజయ దంపతులు మాట్లాడుతూ.. శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొలువుదీరే దుర్గమ్మ తల్లి మహిమాన్వితమైనదని, అమ్మవారిపై తమకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని తెలిపారు. గత ఏడాది అమ్మవారిని దర్శించుకుని మొక్కుకున్నామని, తమ కోరిక నెరవేరడంతో ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది వెండి పట్టీలను సమర్పించినట్లు పేర్కొన్నారు.

అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ బర్ల శ్రీనివాస్, వైస్ చైర్మన్ తాళ్లపల్లి కిషోర్ ఆధ్వర్యంలో విజయ దంపతులను శాలువాతో సత్కరించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, దుర్గాభవాని భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!