ePaper
Wednesday, November 18, 2026
ePaper
Homeతెలంగాణరెండు లక్షల మందితో పాట్నాలో అత్యంత భారీ ఎత్తున నిర్మించిన ‘పుష్ప 2’ పాట్నా కార్యక్రమానికి...

రెండు లక్షల మందితో పాట్నాలో అత్యంత భారీ ఎత్తున నిర్మించిన ‘పుష్ప 2’ పాట్నా కార్యక్రమానికి రెండేళ్లు..

📰 Generate e-Paper Clip

రెండు లక్షల మందితో పాట్నాలో అత్యంత భారీ ఎత్తున నిర్మించిన ‘పుష్ప 2’ పాట్నా కార్యక్రమానికి రెండేళ్లు..

హైదరాబాద్:అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 18.

2.6 లక్షల మంది ఆన్‌లైన్ వీక్షకులతో సరికొత్త మైలురాయి.
* 2 లక్షలకు పైగా ప్రజలు హాజరవడం, 2.6 లక్షల మంది యూట్యూబ్ వీక్షకులు ఏకకాలంలో వీక్షించడంతో, భారతీయ సినిమా చరిత్రలో అపూర్వమైన దృశ్యంగా నిలిచిన ‘పుష్ప 2’ ట్రైలర్ విడుదల కార్యక్రమం,
రెండు సంవత్సరాల క్రితం 2024 నవంబర్ 17న, భారతదేశంలో సినిమా ప్రచార కార్యక్రమాల స్థాయిని పునర్నిర్వచించిన ఒక అద్భుతమైన సినిమా దృశ్యానికి పాట్నా సాక్ష్యంగా నిలిచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ విడుదల కార్యక్రమం 2 లక్షలకు పైగా ప్రజలు అపూర్వంగా హాజరై ఒక చారిత్రాత్మక వేడుకగా మారింది. ఈ కార్యక్రమానికి మరో విశేషమైన మైలురాయిగా ట్రైలర్ విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్‌లో అసాధారణంగా 2.6 లక్షల మంది ఏకకాల వీక్షకులను నమోదు చేసింది. ఇది ఒక భారతీయ సినిమా కార్యక్రమానికి నమోదైన అత్యధిక ప్రత్యక్ష వీక్షకుల సంఖ్యగా నిలిచింది.
ప్రత్యక్షంగానూ, డిజిటల్‌గానూ ఈ కార్యక్రమం అసాధారణ స్థాయిలో జరిగింది. తమ అభిమాన హీరోని ఒక్కసారి చూడటానికి వేలాది మంది అభిమానులు వేదిక వద్దకు, చుట్టుపక్కల ప్రాంతాలకు పోటెత్తగా, లక్షలాది మంది ఆన్‌లైన్‌లో ఈ వేడుకలను వీక్షించారు.
ఈ అద్భుతమైన స్పందనకు సెంటరాఫ్ అట్రాక్షన్ అల్లు అర్జున్. ఆయనకి గ్లోబల్ ఇమేజ్, హద్దుల్లేని అభిమానం వల్లే ఇదంతా సాధ్యమైంది. పాట్నాలో లభించిన ఈ అఖండ స్పందన, ఆయనకున్న అపారమైన పాన్-ఇండియా స్టార్‌డమ్‌ను, పుష్ప ఫ్రాంచైజీకి లభించిన అపూర్వమైన ఆదరణను ప్రతిబింబించింది.
ఒక సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంగా ప్రారంభమైనది కాస్తా.. ఒక భారీ బహిరంగ వేడుకగా రూపుదిద్దుకుంది. జనసమూహాన్ని సమీకరించడం, డిజిటల్ వీక్షణలు, ప్రేక్షకుల భాగస్వామ్యం వంటి విషయాలలో భారతీయ సినిమా కార్యక్రమాలకు ఇది ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది.
రెండు సంవత్సరాల తర్వాత కూడా పాట్నాలో జరిగిన ఈ కార్యక్రమం ‘పుష్ప 2: ది రూల్’ ప్రయాణంలో ఒక కీలకమైన ఘట్టంగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్‌కి నిదర్శనంగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!