సింగరేణినీ నిండా ముంచి మాపై విమర్శల పదేళ్లు మీరు చేసిందేంటో. వి సీతారామయ్య,
అర్జున్ సమాచారం. సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి ఆగస్టు 31
సింగరేణి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడింది పోరాడుతున్నది పోరాడుతున్న ది ఏ ఐ.టి.యు సి మాత్రమేనని మొన్న జరిగిన ఒప్పందంలో కార్మికుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని 34 డిమాండ్లతో సమ్మె నోటీసులు యాజమాన్యానికి జారీ చేశామని ఇందులో 24 సమస్యలను పరిష్కరించామని ఒప్పందం జరగకపోతే సమ్మెకు సిద్ధమని హెచ్చరించడంతోనే యాజమాన్యం దిగివచ్చి సమస్యల పరిష్కారం కోసం ఒప్పందానికి దిగివచ్చిందని ఇదంతా కార్మిక వర్గ ప్రయోజనాల కోసం తాము చేయడం వల్లనే మంచి ఒప్పందం జరిగిందని సోమవారం మందమర్రి ఏ ఐ టి యు సి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికుడు సహజ మరణం పొందితే 25 లక్షల నష్టపరిహారం ఇవ్వడానికి ఈ ఒప్పందంలో సాధించామని గత గుర్తింపు సంఘం కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని కోల్ ఇండియాలో 13 సంవత్సరాల క్రితమే పెర్క్స్ అలవెన్స్ ల మీద టాక్స్ నుండి కార్మికులకు యాజమాన్యాలు రీఎంబర్స్మెంట్ చెల్లిస్తున్నాయని సింగరేణిలో అధికారులు కూడా ఈ అలవెన్స్లు పొందుతున్నారని కార్మికులకు మాత్రం చెల్లించకుండా నిర్లక్ష్యం చేయడానికి వ్యతిరేకిస్తూ ఈ ఒప్పందంలో కార్మికులందరికీ ఈ అలవెన్స్ ల మీద రీఎంబర్స్మెంట్ చెల్లించేందుకు ఒప్పందం జరిగిందని అంతేకాక డిప్లొమా చేసిన ఓవర్ మేన్లకు ఖాళీలతో సంబంధం లేకుండా అవకాశం కల్పించేందుకు ఒప్పందం జరిగిందని ఇది తమ యూనియన్ చేసిన ఘనత కాకుండా పోతుందా మాపై విమర్శలు చేసే నాయకులు ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడాలని ఏఐటీయూసీ నాయకులు వాసు రెడ్డి సీతారామయ్య సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనేక సమస్యలు సాధించామని మిగతావి కూడా సాధించేందుకు తమ సంఘం నిరంతరం పోరాడుతూనే ఉంటుందని విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు 34 డిమాండ్లను యాజమాన్యానికి ఇచ్చి 24 డిమాండ్లు సాధించి ఒప్పందం చేసుకున్నామని మిగతా వాటిని కూడా పరిష్కరిస్తామని ఒకవేళ యాజమాన్యం స్పందించకపోతే అప్పుడు కూడా సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమేనని ఆయన అన్నారు కొన్ని పనికిమాలిన సంఘాలు ఏనాడు ఏ ఉద్యమం చేయని వాళ్ళు కార్మికుల చేత తిరస్కారానికి గురై వ్యతిరేకతను మూటగట్టుకొని కనుమరుగై నేడు మాత్రం తగుదునమ్మ అంటూ అక్కరకు రాని విమర్శలు చేస్తున్నారని సింగరేణి ప్రాంతంలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ మీ కేసీఆర్ దగ్గర మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం టీబీజీకేఎస్ నాయకుల స్వార్థపూరిత దోపిడీ వల్లనే ఓడామని మొరపెట్టుకున్నది మరిచారా ఇంకా మా సంఘం మీద విమర్శలు చేసే స్థాయి మీకుందా అంటూ గాటుగా హెచ్చరించారు మీ పాలనలో తాడిచర్ల గనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం కోసం ఎంత అవినీతి కీ పాల్పడ్డారు మర్చిపోయారా అది శాపంగా మారి నేడు సింగరేణికి నూతన గనులు రాకుండా పరిస్థితులు దాపురించాయని నేటికీ సింగరేణి కోలుకోలేని విధంగా వేలాది కోట్లు నష్టపోయింది మీ తప్పుడు విధానాల వల్ల కాదా అని ఆయన అన్నారు పనికిరాని ప్రకటనలు మానుకొని మీ తప్పులను సరిదిద్దుకుంటే మంచిదని ఆక్షేపించారు ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి చలివేంద్రి సత్యనారాయణ ఉపాధ్యక్షులు భీమనాథుని సుదర్శన్ నాగ మల్లేష్ కంది శ్రీనివాస్ రాజేశం గాండ్ల సంపత్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

