ePaper
Monday, August 31, 2026
ePaper
Homeజగిత్యాలజగిత్యాల జిల్లా లో యంగ్ ఇంటిగ్రెటెడ్ రెసిడెన్నిషియల్స్కూల్

జగిత్యాల జిల్లా లో యంగ్ ఇంటిగ్రెటెడ్ రెసిడెన్నిషియల్స్కూల్

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా లో యంగ్ ఇంటిగ్రెటెడ్ రెసిడెన్నిషియల్
స్కూల్

జగిత్యాల ప్రతినిధి .అర్జున్ సమాచారం ఆగస్టు 29::

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతోంది అని జగిత్యాల నియోజకవర్గం లో తాటిపల్లి శివారులో 25 ఎకరాల్లో ఎర్పాటు చేయనున్న యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులను అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
తెలంగాణ ముఖ్యమంత్రి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యం పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి సౌకర్యాలను ఒకే ప్రాంగణంలో అందించడం అని అన్నారు. 2500 మంది విద్యార్థులకు ఆధునిక విద్యా సదుపాయాలు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విద్య
హాస్టల్, భోజనం వంటి వసతి సౌకర్యాలు
ప్రయోగశాలలు, లైబ్రరీ, కంప్యూటర్ సదుపాయాలు
క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అందించడం ప్రాధాన్యత అని,విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం
అన్ని వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని అన్నారు.జగిత్యాల నియోజకవర్గానికి 200 కోట్ల తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జగిత్యాల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య,amc చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి,సర్పంచులు బొలిశెట్టి గంగారెడ్డి, కట్ట రాజేందర్,మాజీ జడ్పీటీసీ ముస్కు ఎల్లారెడ్డి,పెండెం రాములు,
మాజీ సర్పంచ్ లు నక్కల రవీందర్ రెడ్డి,బాల ముకుందం,గంగారం,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుభూమారెడ్డి,నాయకులు మల్లేశం గౌడ్,సురేష్,సదానందం,సతీష్,గంగారెడ్డి,మహేష్,మనోజ్,దిలీప్,వెంకటేష్,
ఎమ్మార్వో హకీమ్,AE లు శశి,ధనుంజయ్,తాటిపల్లి,చల్గల్,మోరపల్లి గ్రామాల నాయకులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!