ట్రాక్టర్ ఢీకొని కాలు కోల్పోయిన యువకుడు
అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 12.
ట్రాక్టర్ డీ కొట్టి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా వారిలో ఓ యువకుడు కాలు ను కోల్పోయాడు. శనివారం ఉదయం బి.కొత్తకోట మండలంలో జరిగిన ఘటనపై బాధితుల కుటుంబీకుల కథనం.. నాయిని బాబి పంచాయితీ, కమ్మోల్లపల్లి కు చెందిన రాజేంద్ర (23), కాయలోల్లపల్లి కు చెందిన హరికృష్ణ (28) లు బైకులో కురబలకోట మండలంలోని అంగళ్లు గొర్రెల సంతకు బయలుదేరారు. స్కూటర్ మార్గమధ్యంలోని నాయిని బావి కోళ్ల ఫారం వద్దకు రాగానే ట్రాక్టర్ డీ కొట్టి హరికృష్ణ కాలు రెండుగా విరిగిపోయింది. అలాగే రాజేంద్ర స్వల్పంగా గాయపడడంతో క్షతగాత్రులను 108లో హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్య చికిత్సల అనంతరం హరికృష్ణను వెంటనే బెంగళూరుకి రెఫర్ చేశారు. కొత్తకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు…

