ePaper
Saturday, October 17, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్అక్రమంగా అమర్చిన 12 మోటార్లు స్వాధీనం కూకట్‌పల్లి జోన్‌లో జలమండలి విజిలెన్స్ అధికారుల తనిఖీలు

అక్రమంగా అమర్చిన 12 మోటార్లు స్వాధీనం కూకట్‌పల్లి జోన్‌లో జలమండలి విజిలెన్స్ అధికారుల తనిఖీలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌,అర్జున్ సమాచారం:
తాగునీటి సరఫరా పైపులైన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుకుంటున్న వారిపై జలమండలి విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం కూకట్‌పల్లి జోన్ పరిధిలోని డివిజన్‌-22, గాయత్రీనగర్ వార్డులోని వివేకానందనగర్ కాలనీలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 12 అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు.ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు జలమండలి విజిలెన్స్ బృందం సంబంధిత మేనేజర్‌తో కలిసి ఈ తనిఖీలు చేపట్టింది. తాగునీటి సరఫరా పైపులైన్లకు అక్రమంగా అమర్చిన మోటార్లను గుర్తించి తొలగించారు. తాగునీటి పైపులైన్లకు నేరుగా మోటార్లు బిగించి నీటిని తోడుకోవడం వల్ల ఇతర వినియోగదారులకు సరిపడా నీరు అందకపోవడంతో పాటు సరఫరా ప్రెషర్ తగ్గే అవకాశం ఉందని జలమండలి పేర్కొంది. అక్రమ మోటార్ల వినియోగాన్ని అరికట్టేందుకు తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!