సిద్దిపేట,అర్జున్ సమాచారం:
హరీష్ రావు మాట్లాడుతూ శోకాన్ని మరిపించేల సుందరీ కరణ గ శ్రీరామ కుంట స్మశాన వాటిక
బయో గ్యాస్ ద్వారా దహన సంస్కారాలు ప్రారంబానికి సిద్ధం చేయాలి.
లైటింగ్, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి
పెండింగ్ పనులు వెంటనే చేపట్టాలని పలు సూచనలు.
శ్రీరామ కుంట వైకుంఠ దామ పనులను క్షేత్ర స్థాయి లో పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట పట్టణం లో మోడల్ గా తీర్చిదిద్దిన శ్రీరామ కుంట స్మశాన వాటిక మరింత సుందరీ కరణ చేపడుతున్న నేపథ్యంలో పనులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. జరిగిన పనుల పై సంతృప్తి వ్యక్తం చేస్తూ పెండింగ్ పనులు పై పలు సూచనలు చేసారు ఆత్మ ఆనంద పడేలా, శోకాన్ని మరిపించే విధంగా సుందరీకరణ, నందన వనంగా చేసుకుంటున్నామని చెప్పారు. వైకుంఠ దామం అంటే ఒక పార్క్ మాదిరిగా చేసుకున్నామని మరింత సుందరీకరణ గా తీరదిద్దెందుకు పనులు చేపడుతున్నట్లు చెప్పారు వైకుంఠ దామం క్షేత్ర స్థాయి లో పరిశీలించారు. మరికొన్ని మొక్కలు నాటలని, సిసి రోడ్డు వేయాలని, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలనీ చెప్పారు రాత్రి సమయాల్లో లైటింగ్ లేక దహన సంస్కారలకు ఇబ్బంది అవుతుందని వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. టాయిలెట్స్ మరమ్మత్తులు చెప్పట్టాలని చెప్పారు బయో గ్యాస్ ద్వారా దహన సంస్కారాలు జరిగేవిధంగా పనులు త్వరతగతిన పూర్తి చేసి ప్రారంభించాలని చెప్పారు.
==============================

