ePaper
Friday, August 21, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిఅభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ రమ కమాన్ పూర్

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ రమ కమాన్ పూర్

📰 Generate e-Paper Clip

కమాన్ పూర్,అర్జున్ సమాచారం:

పాలకుర్తి మండలంలోని గన్ శ్యామ్ దాస్ నగర్ గ్రామ అభివృద్ధిలో భాగంగా సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ సూరరమ మరియు డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య  ప్రారంభించారు.

గ్రామంలో అభివృద్ధి పనుల కోసం డి ఎం ఎఫ్ టినిధులు కేటాయించాలని గౌరవ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని డీసీసీ ప్రధాన కార్యదర్శి  సూర సమ్మయ్య  కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించి గ్రామానికి రూ.15 లక్షల డి ఎం ఎఫ్ టి నిధులు మంజూరు చేశారు.

ఈ నిధుల్లో భాగంగా రూ.5 లక్షల వ్యయంతో  ఓర్సు ఎల్లస్వామి ఇంటి నుంచి నర్ర కుమార్ ఇంటి వరకు సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. డ్రైనేజీ నిర్మాణంతో గ్రామ ప్రజలకు మురుగు నీటి సమస్య నుంచి ఉపశమనం కలగడంతో పాటు పారిశుధ్యం మెరుగుపడుతుందని స్థానికులు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో *ఉపసర్పంచ్ ముత్యాల ఉదయ్ వార్డు సభ్యులు కోమిరే జ్యోతి రాజు, కంకటి శ్రీనివాస్ గౌడ్, సూర స్వరూప, సూర చిన్న మల్లయ్య, తపట్ల మోహన్, చొక్కాల వైష్ణవి–ఉదయ్, ఓల్లెపు అంజు కుమార్ సట్ల అశోక్, కొండ్రా సాయి, జంపాల శారదా, మాజీ వార్డు సభ్యులు ఓర్సు ఎల్లస్వామి, సంపంగి కుమార్, కోమిరే సురేష్, బాధవత్ శంకర్ నాయక్, కోమిరే శంకర్, ధరంగుల మొగిలి  తదితరులు పాల్గొన్నారు.
==============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!