పెద్దపల్లి,అర్జున్ సమాచారం:
రాష్ట్రంలోని బహుజానులం తా సంఘటితం కావాలని బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు తగరం శంకర్ లాల్ పిలుపునిచ్చారు. పెద్దప ల్లి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1902 లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఛత్రపతి సాహు మహారాజ్ 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. నేటి పాలకులు 80 శాతం పైగా ఉన్న బహుజ న వర్గాలకు రిజర్వేషన్లు సరి గా అందకుండా చేస్తూ వారిని దేశ సంపదకు దూరం చేస్తు న్నారని ధ్వజమెత్తారు. ఛత్రప తి సాహు మహారాజ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా ఉద్యమానికి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి సందర్భంగా బహుజన సేన ఆద్వర్యంలో హైదారాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 26న నిర్వహించే సదస్సుకు ప్రజాస్వామిక వాదులు, బహుజన సంఘాల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. సమావే శంలో వివిధ సంఘాల నాయకులు నోమూరి శ్రీధర్, నూనె కుమార్, ఆసం తిరుపతి, కట్కూరి సందీప్, గద్దల శంకర్, సంకెనపల్లి లక్ష్మణ్, బి. లక్ష్మణ్, లింగంపల్లి శంకర్, రాగమల్ల మధుకర్, దొడ్ల రమేష్, కోల శ్రీనివాస్, నల్లవెల్లి శంకర్, కంకటి లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

