ఓటరు జాబితాపై విస్తృత అవగాహన కల్పించాలి.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలి..
అర్జున్ సమాచారం. ఆగస్టు 20. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
జైపూర్, ఆగస్టు 20:జైపూర్ మండల పరిధిలోని గంగిపల్లి, ఎల్కంటి, టేకుమట్ల గ్రామపంచాయతీలను గురువారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాపురావు సందర్శించారు. గ్రామపంచాయతీల్లో ప్రచురించిన ప్రత్యేక సవరణ ముసాయిదా ఓటరు జాబితాలను పరిశీలించారు.
గ్రామంలోని ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో తమ పేరు, ఇతర వివరాలు సక్రమంగా నమోదయ్యాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాలో పేరు నమోదు కాకపోయినా, వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నా సంబంధిత బూత్ స్థాయి అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని ఎంపీడీవో పరిశీలించారు. మంజూరైన ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో గృహ నిర్మాణ శాఖ సహాయ ఇంజినీర్ కాంక్ష, టేకుమట్ల సర్పంచ్ బల్ల వెంకటేష్, ఉపసర్పంచ్ గోనె ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శులు ఏ. సత్యనారాయణ, టి. శ్రీనివాస్, బూత్ స్థాయి అధికారులు సుజాత, సరిత తదితరులు పాల్గొన్నారు.

