ePaper
Sunday, August 30, 2026
ePaper
Homeసినిమాకింగ్ 100’ మూవీ మైండ్ బ్లోయింగ్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్,

కింగ్ 100’ మూవీ మైండ్ బ్లోయింగ్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్,

📰 Generate e-Paper Clip

కింగ్ నాగార్జున మైల్‌స్టోన్ 100వ చిత్రం #కింగ్ 100, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో, రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా పవర్‌ఫుల్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
నాగార్జున వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమయ్యే గ్లింప్స్‌లో సమాజం మనుషులను వారి సంపద ఆధారంగా ఎలా విభజిస్తుందనే అంశాన్ని ఆసక్తికరంగా ప్రస్తావించారు. తన దగ్గర ఏమీ లేనప్పుడు తనను ‘లూజర్’ అని పిలిచారని, అదే సంపద సంపాదించిన తర్వాత ‘ది కింగ్’ అని పిలుస్తున్నారని నాగార్జున చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మరోవైపు నాగార్జున ఫొటోతో పాటు రూ.50,000 కోట్ల భారీ స్కామ్‌కు సంబంధించిన వార్తను చూపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
నాగార్జున మైల్‌స్టోన్ 100వ సినిమాకు ‘కింగ్ 100’ అనే టైటిల్ పర్ఫెక్ట్‌గా ఉంది. నాగార్జున తన స్టార్‌డమ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను ఎంచుకున్నారని గ్లింప్స్ చూస్తుంటే అర్ధమౌతోంది.
నాగార్జునను అత్యంత స్టైలిష్, డైనమిక్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, యాటిట్యూడ్ ఆకట్టుకున్నాయి. నిజమైన సూపర్‌స్టార్‌కు ఉండే రాయల్ స్వాగ్‌తో నాగార్జున కనిపించారు. ఆయన పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తిని గ్లింప్స్ మరింత పెంచింది.
డైరెక్టర్ రా కార్తీక్  స్టొరీ తేల్లింగ్ కూడా ఫ్రెష్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, రిచ్ విజువల్స్ గ్లింప్స్‌ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాయి. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ ఇంపాక్ట్‌ను మరింత పెంచింది. నాగార్జున–డీఎస్పీ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ క్రియేట్  చేయబోతోంది.
‘కింగ్ 100’ టైటిల్ గ్లింప్స్ మజెస్టిక్‌గా, మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. నాగార్జున పవర్‌ఫుల్ అవతార్, ఆసక్తికరమైన కథాంశం, గ్రాండ్ విజువల్స్, హై-ఎనర్జీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. అక్కినేని అభిమానులు, ప్రేక్షకులను ఈ గ్లింప్స్ అలరించింది.
ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
‘కింగ్ 100’ చిత్రం క్రిస్మస్ కానుకగా 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
తారాగణం: కింగ్ నాగార్జున, టబు
============================

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!