ePaper
Sunday, August 30, 2026
ePaper
Homeసినిమాచంద్రబోస్‌ క్లాప్‌తో కిట్టు పవన్‌ హీరోగా నూతన చిత్రం ప్రారంభం

చంద్రబోస్‌ క్లాప్‌తో కిట్టు పవన్‌ హీరోగా నూతన చిత్రం ప్రారంభం

📰 Generate e-Paper Clip

తెలంగాణా మట్టి వాసనలతో సంచలనమైన జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్‌ సాధించి ప్రేక్షకులకు దగ్గరైన కిట్టు హీరోగా శనివారం రోజున సినిమా ప్రారంభమైంది. యం.యస్‌ వారాహి క్రియేషన్స్‌ , శివమ్‌ మీడియా పతాకంపై ప్రొడక్షన్‌ నం 3గా ముని శివ, శివమల్లాలలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దిలీప్‌ సాయి నాయక్‌. మాదాపూర్‌  శివమ్‌ మీడియా కార్యాలయంలో చిత్రం వై¿¶ వంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ రచయిత ఆస్కార్‌ అవార్డు విన్నర్‌ చంద్రబోస్‌ , దర్శకుడు ఆర్‌.పి పట్నాయక్, నేషనల్‌ అవార్డు విన్నర్‌ సతీష్‌ వేగేశ్న, బిగ్‌ టీవి చైర్మెన్‌ విజయ్‌ వెన్నం పాల్గొన్నారు. దర్శకుడు దిలీప్‌కి స్క్రిప్ట్‌ని సతీష్‌ వేగేశ్న, బుల్లెట్‌బండి లక్ష్మణ్‌ అందించగా హీరో కిట్టుపై చంద్రబోస్‌ క్లాప్‌ నిచ్చారు. ఆర్‌ పి పట్నాయక్‌ తొలిషాట్‌కి గౌరవ దర్శకత్వం వహించగా బిగ్‌ టీవి విజయ్‌ కెమెరా స్విచాన్‌ చేసి టీమ్‌కి అభినందనలు తెలిపారు. చంద్రబోస్‌ మాట్లాడుతూ– ‘‘ ఈ టీమ్‌ గురించి నాకు చాలా బాగా తెలుసు. టీమంతా ఎంతో టాలెంట్‌ ఉన్నవారు. నిర్మాతలు ముని శివ, శివమల్లాలల, బుల్లెట్‌బండి లక్ష్మణ్, సంగీత దర్శకుడు మదిన్‌ నాకు ఎంతో ఆత్మీయులు. వారందరూ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. సతీష్‌ వేగేశ్న మాట్లాడుతూ– మంచికథతో వచ్చిన దర్శకుడు దిలీప్‌కి మా శివలిద్దరూ ఎంతో సపోర్ట్‌ చేస్తున్నారు. వీరందరికి పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఆర్‌పి పట్నాయక్‌ మాట్లాడుతూ– ‘‘ ఈ నిర్మాతలిద్దరూ మంచి సినిమాలు చేసి పెద్ద నిర్మాతలుగా మారి పదులకొద్ది సినిమాలు తీయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. హీరో కిట్టు మాట్లాడుతూ–‘‘ నేను చాలా చిన్న నటునిగా ఫోక్‌ సాంగ్స్‌ చేసేవాడిని. అలాంటిది నేను చేస్తున్న ఈ సినిమాకి ఇంత పెద్దవాళ్లు వచ్చి సపోర్టు చేయటం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మదిన్, కెమెరామెన్‌ జనతా బబ్లూ,  నూతన దర్శకుడు కృష్ణకాంత్, ఫోక్‌ ఇండస్ట్రినుండి అనేకమంది కళాకారులు పాల్గొన్నారు.
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!