హైదరాబాద్,అర్జున్ సమాచారం:
హైదరాబాద్ ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 6:30 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో కార్యాలయంలో కీలక పత్రాలు తగలబడి ఉంటాయన్న అనుమానాలు వస్తున్నాయి. కార్యాలయ భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనా. కాలిపోయిన రికార్డులు, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
RELATED ARTICLES

