మేడ్చల్ జిల్లా:::అర్జున్ సమాచారం:
గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని శామీర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన బైద్నాద్ (29) అనే వ్యక్తి తన భార్య పూజా కుమారి ఇద్దరు పిల్లలతో శామీర్ పేట మండలం తూముకుంట చంద్రా రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు.తాను నివాసం ఉంటున్న ప్రాంతంలోనే పాన్ షాప్ ను నడిపి జీవనం కొనసాగిస్తున్నాడు.అధిక డబ్బులకు ఆశపడిన బైద్నాద్ బీహార్ రాష్ట్రం నుంచి 40 చాక్లెట్లతో కూడిన ప్యాకెట్ ను 200 రూపాయలకు తెచ్చి ఇక్కడ ఒక్కో ప్యాకెట్ ను 500 నుంచి ఆరు వందలకు అమ్మేవాడు.విశ్వసనీయమైన సమాచారం అందుకున్న శామీర్ పేట పోలీసులు నిన్న బైద్నాద్ ను అరెస్ట్ చేశారు.అతని వద్ద నుంచి 5298 చాక్లెట్ ప్యాకెట్లు, సుమారు 25 కేజీలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించినట్టు జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి మీడియాకు వెల్లడించారు.కాగా నిందితుడి భార్య పూజా కుమారి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు
================

