ePaper
Monday, August 31, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో పాత కార్యవర్గం సమావేశం

జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో పాత కార్యవర్గం సమావేశం

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:
జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో కార్యవర్గ వివాదానికి తెరపడింది అని కిలారు రాజేశ్వర్ రావు తెలిపారు. ఫోర్జరీ పత్రాల ఆధారంగా కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు వచ్చిన ఆరోపణలను పరిశీలించిన రిజిస్ట్రార్ నరేంద్ర చౌదరి నేతృత్వంలోని కార్యవర్గం ఏర్పాటు చెల్లదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు సురేందర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న పాత కార్యవర్గం తిరిగి క్లబ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది.ఇందు లో భాగంగా ఈరోజు, ఆగస్టు 29, శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో పాత కార్యవర్గం తిరిగి బాధ్యతలు స్వీకరించనుంది అని అన్నారు. సురేందర్ రెడ్డి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఫోర్జరీకి సంబంధించిన వ్యవహారంపై జూబ్లీ హిల్స్ పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు క్లబ్ వర్గాలు తెలిపాయి.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నట్లు వారు తెలిపారు.ఫోర్జరీ పత్రాలను గుర్తించిన నేపథ్యంలో నరేంద్ర చౌదరి నేతృత్వంలోని కార్యవర్గాన్ని తొలగించి, సురేందర్ రెడ్డి నేతృత్వంలోని పాత కార్యవర్గాన్ని కొనసాగించాలని రిజిస్ట్రార్ ఆదేశించినట్లు క్లబ్ వర్గాలు పేర్కొన్నాయి.ఇది ప్రజాస్వామ్యానికి విజయం” అని క్లబ్ కార్యదర్శి రాజేశ్వర్ రావు కిలారు హర్షం తెలిపారు.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!