ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిజాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులను సన్మానించిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులను సన్మానించిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్

📰 Generate e-Paper Clip

గోదావరిఖని ,అర్జున్ సమాచారం :

రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు  ఎం.ఎస్. రాజ్ ఠాకూర్  జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా SIMS మెడికల్ కాలేజీ యాజమాన్యం ఆహ్వానం మేరకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్  కేక్ కట్ చేసి వైద్యులకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులను శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు.

అలాగే మెడికల్ విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి, వారి విద్యాభ్యాసం, లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో కష్టపడి చదువుకుని ప్రజలకు సేవ చేసే గొప్ప వైద్యులుగా ఎదగాలని విద్యార్థులకు ఆకాంక్షించారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, వారి అంకితభావం సమాజానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు పేర్కొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
=============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!