మెదక్.అర్జున్ సమాచారం:
నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా తూప్రాన్ పట్టణంలోని 2 బీహెచ్ కె కాలనీలో ఈరోజు మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ (కార్డన్ సెర్చ్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 105 మంది పోలీసు సిబ్బంది పాల్గొని 450కు పైగా ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలు, 3 త్రిచక్ర వాహనాలు (మొత్తం 64) స్వాధీనం చేసుకున్నారు.
మాదకద్రవ్యాల ఉనికిని గుర్తించేందుకు నార్కోటిక్ డాగ్ ‘జూబి’ సహాయంతో అణువణువూ తనిఖీలు చేశారు.
ఫింగర్‌ప్రింట్ డివైజ్‌ల ద్వారా పాత నేరస్థుల వివరాలను గుర్తించే ప్రక్రియ చేపట్టారు.
“ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఉద్దేశం సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి ప్రజల భద్రతకు భరోసా కల్పించడమే. మీ పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి” అని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ , సీఐలు వెంకటరాజ్ గౌడ్, రంగకృష్ణ, ఎస్సైలు, సీసీఎస్, షీ టీమ్స్, డాగ్ స్క్వాడ్ బృందాలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తూప్రాన్‌లో పోలీసుల భారీ కార్డన్ సెర్చ్.. 450కి పైగా ఇళ్లలో తనిఖీలు, పత్రాలు లేని 64 వాహనాలు స్వాధీనం
RELATED ARTICLES

