ePaper
Tuesday, September 1, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్తెలంగాణలో గ్యాంగ్ వార్ నడిపిస్తున్న మంత్రులు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే కేసులు,అరెస్టులు,దర్యాప్తులు. జూబ్లిహిల్స్ కేసు,పోలీస్...

తెలంగాణలో గ్యాంగ్ వార్ నడిపిస్తున్న మంత్రులు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే కేసులు,అరెస్టులు,దర్యాప్తులు. జూబ్లిహిల్స్ కేసు,పోలీస్ పోస్టింగులపై సిట్ వేయాలి. బిఆర్ఎస్ 3.0 పాలనలో పోలీస్ పోస్టింగులపై ట్రిబ్యునల్ వేస్తం. పోలీస్ పోస్టింగులలో సామాజిక న్యాయం పాటించరా జూబ్లిహిల్స్ ఎసిపి,డిసిపి మీద కూడా చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ఎవరైనా దాడికి గురైతే, అనుభవం గుండె ఉన్న ఏ పోలీసైనా వెంటనే హాస్పిటల్ కి పంపి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తారు. కానీ రేవంత్ హోం మంత్రి అయినా తర్వాత అరాచక పాలన సాగుతుంది. గాంధీ మరియు ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొంది, రిజిస్టర్ పోస్ట్ చేసినా  పోలీసులు పట్టించుకోలేదనా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు,
తెలంగాణ లో గ్యాంగ్ వార్ నడుస్తుంది. రోడ్డు పక్కన ఉన్న అద్దాల మేడల వెనుక గ్యాంగుల డెన్ లు కూడా ఉన్నాయని తెలుస్తుంది. గ్యాంగ్ ల కొట్లాటలో చిన్న స్థాయి పోలీసులు బలవుతున్నారు. జూబ్లిహిల్స్ లో ముత్తు యాదవ్ అకారణంగా సస్పెండ్  అయ్యారు,. చిట్యాల లో మల్లేష్ అనే ఇన్సిపెక్టర్ కాంగ్రెస్ నాయకునిపై ఎఫ్ఐఆర్ చేసినందుకు చర్యలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో కింది స్థాయి అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎల్ బి నగర్ లో ఇటీవలే ఒక కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకొని మరణించారు.  ఒత్తిడిని తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. నిన్న డిజిపి  మాత్రం అంతా అందంగా బాగానే ఉందని ప్రెస్ మీట్ పెట్టి ఆరు నెలల నేరాల సమీక్ష కార్యాక్రమంలో అంటున్నారు.  జూబ్లిహిల్స్ లో ఘటన జరిగితే, మల్కాజిగిరిలో కేసు నమోదు. నిందితుడు సైబరాబాద్ లో తలదాచుకున్నాడు.   హరికృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఆగస్టు 20 న మేడిపల్లి లో జీరో ఎఫ్ఐఆర్ నమోదయయింది. జులై 30న కొండా సురేఖ ఒఎస్డి సుమంత్, హరికృష్ణ అనే వ్యక్తికి కాల్ చేసి అర్జెంటు గా మాట్లాడాలి అని పిలిస్తే.. తర్వాత కలుస్తా అని చెప్పినా వినకపోతే.. వెంటనే రెంట్  కార్ తీసుకొని కిరణ్ అనే మిత్రుడితో కలిసి బాధితుడు జూబ్లిహిల్స్ వెళ్లాడు.  సుమంత్ పై గతంలో ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండానే టాస్క్ ఫోర్స్ పోలీసులు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొండా సురేఖ ఇంటికి వెళ్లగా.. మంత్రి కుమార్తె సుష్మిత అడ్డుపడగా పోలీసులు వెళ్లిపోయారు. అసలు ఎఫ్ఐఆర్ కాకుండా పోలీసులు ఎలా వెళ్తారు. ఎలా తిరిగొస్తారని అయన ప్రశ్నించారు.
బిఆర్ఎస్ నాయకులను ఎంత బతిమాలినా వదలకుండా తీసుకెళ్తారు. నల్లబాలును ఇంట్లో వాల్లపై దాడి చేసి మరీ తీసుకెళ్లి జైలుకు పంపారు. ఈ విధంగా పోలీసులు పెద్దల పట్ల ఒక రకంగా, పేదల పట్ల ఒక రకంగా వ్యవహరిస్తున్నారు.  మహబూబాబాద్ లో పోలీసులు విద్యార్థుల గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారు.  కోదాడ లో ఒక వ్యక్తి రోడ్డు పై ధర్నా చేస్తే , అక్కడి ఉన్సిపెక్టర్ దారుణంగా ప్రవర్తించారు.   పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉండే డెన్ లో సుమంత్ ఆయన అనుచరులు హరికృష్ణ పై దాడికి పాల్పడ్డారు.  రాడ్లతో దాడి చేయగా, చెయ్యి ఫ్రాక్చర్  రక్తపు వాంటింగ్స్ అయినాయి.
దాడి సమయంలో పోలీసు కానిస్టేబుల్స్ వచ్చి బాధితున్ని కాపాడి, జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ పోలీసులకు ఎలా సమాచారం వచ్చింది. ఎవరైనా ఫిర్యాదు చేశారా? 100 కి కాల్ వచ్చిందా? ఎలా తెలిసిందో పోలీసు అధికారులు చెప్పాలి. బాధితున్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి,  ఎందుకు జీడీ ఎంటర్ చేయలేదు?  ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?   రేవంత్ రెడ్డి ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? ఎఫ్ఐఆర్ చేయొద్దని?  జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి కూత వేటు దూరంలో ఉండే,కావూరి హిల్స్ లో ఉన్న నిందితులు సుమంత్ అండ్ గ్యాంగ్ మాధాపూర్ లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
హరికృష్ణ మంత్రులతో మాట్లాడి నిషేధిత భూములు లిస్ట్ నుండి తొలగిస్తామని, ఇతర సెటిల్ మెంట్లు చేపిస్తామని చెప్పితే 1.8 కోట్లు ఇస్తే ఇవ్వడం లేదని సుమంత్ అతని అనుచరులు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఆ కేసు కూడా  రిజిస్టర్ చేయలేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్పితేనే కేసు రిజిస్టర్ అవుతుంది. ఎవరి మీద ఎఫ్ఐఆర్ కావాలో రేవంత్ రెడ్డే చెప్తారు. ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని చేయొద్దు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు.  కొండా సుష్మిత ప్రెస్ మీట్ పెట్టింది ఆగస్టు 18న, ఆ తర్వాతనే రేవంత్ రెడ్డి లండన్ నుండి ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే వెంటనే ఆగస్టు 20 న మేడిపల్లి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ చేశారు. జూబ్లిహిల్స్ లో కేసు నమోదు చేయలేదని సిఐ ముత్తు యాదవ్ ను అధికారులు సస్పెండ్ చేశారు. మరి డిసిపి రమణారెడ్డి,ఎసిపి వెంకట్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదుని ప్రశ్నంచార౮౮ .
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!