ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeసినిమాధియేటర్ల బిజినెస్ లోకి మెగా ఫ్యామిలీ

ధియేటర్ల బిజినెస్ లోకి మెగా ఫ్యామిలీ

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, సెప్టెంబర్ 22,అర్జున్ సమాచారం:
టాలీవుడ్ టాప్ హీరోలలో కొంత మంది థియేటర్ బిజినెస్‌లో అడుగు పెట్టారు. తమ పేరుతో మల్టీప్లెక్స్‌లు కట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ‘ఏఎంబీ’, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏమో ‘ఏఏఏ’, మాస్ మహారాజా రవితేజ ‘ఏఆర్‌టీ’ అంటూ ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి మల్టీప్లెక్స్‌లు కట్టారు. అల్లు ఫ్యామిలీ కోకాపేట్‌లో ‘అల్లు సినిమాస్’ నిర్మించింది. ఇప్పుడు ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి అడుగు పెడుతున్నారు. గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు.హీరోలు అందరితో మల్టీప్లెక్స్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న ఏసియన్ సినిమాస్ సంస్థతో చిరంజీవి కూడా థియేటర్ వ్యాపారంలో అడుగు  పెట్టేందుకు రెడీ అయ్యారు. ప్రపంచంలోనే అత్యంత భారీ సినిమా స్క్రీన్‌ను హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు.
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని పూలర్ ప్రాంతంలో ఉన్న ‘రాయల్ సినిమాస్ 14 ఐమాక్స్ డ్యూయల్ లేజర్’ స్క్రీన్ ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్. ఆ రికార్డు దాని పేరిట ఉంది. ఆ స్క్రీన్ 101 అడుగుల వెడల్పు, 76.2 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఆ థియేటర్ దాదాపు 7,696 చదరపు అడుగుల భారీ వైశాల్యంలో విస్తరించి ఉంది. అంతే కాదు… ఆ థియేటర్‌లో 363 రెక్లైనర్ సీట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో అంత కంటే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడానికి చిరంజీవి – ఏసియన్ సినిమాస్ సంస్థ రెడీ అవుతోందని సమాచారం. సేమ్ అటువంటి స్క్రీన్ లేదంటే దాని కంటే ఒక్క ఇంచ్ ఎక్కువ ఉన్న స్క్రీన్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు అయ్యాయి.చిరంజీవి – ఏసియన్ సినిమాస్ సంస్థ భాగస్వామ్యంలో ఏర్పాటు కాబోయే స్క్రీన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. అది గనుక రెడీ అయితే… ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచంలో హైదరాబాద్ సిటీకి ప్రత్యేక గుర్తింపు వస్తుంది.
=====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!