కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ గృహాలు గతంలో నిర్మించుకొని వారికి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఈ గ్రామాన్ని పైలట్ గ్రామంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గుర్తించారు. 328 ఇందిరమ్మ గృహాలను మంజూరు చేశారు. ఈ క్రమంలో 97గృహాలు నిర్మాణము లో ఉన్నాయి. తాము కట్టలేమని మిగతా ఇందిరమ్మ లబ్ధిదారులు తేల్చి చెప్పడంతో వాటిని అధికారులు రద్దు చేశారు. ఈ క్రమంలో లిస్టులో ఉన్నవారు తిరిగి తాము కట్టుకుంటామని సర్పంచ్ పల్లె ప్రతిమ పివి రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జూలై26 వ తేదీన హైదరాబాదులో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు సర్పంచ్ విన్నవించారు. ఆయన కలెక్టర్ కోయ శ్రీహర్షకు తెలియచేయడం జరిగింది. దీనికి తోడు ఈనెల 18వ తేదీన రామగిరి మండల అభివృద్ధి సమావేశంలో ఇందిరమ్మ గృహాలను తిరిగి నిర్మించుకుంటారని,లబ్ధిదారులకు ఒక్క చాన్స్ ఇవ్వాలని సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు కలెక్టర్ కోయ శ్రీహర్ష ను కొరడం జరిగింది. ఈ విషయంలో సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు వినతిమేరకు స్పందించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మరోమారు ఒక్క అవకాశం కల్పించడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మంజూరై ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని వారు తక్షణమే స్పందించి గ్రామపంచాయతీలో పేర్లు నమోదు చేసుకోవాలని సర్పంచ్ కోరారు.
===========================

