కరీంనగర్,అర్జున్ సమాచారం:
పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడుతున్న 24 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్దంపూర్‌లోని మైత్రి ఫ్యామిలీ దాబా సమీపంలో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న బుర్రవ వంశీని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 1 కిలో 140 గ్రాముల గంజాయి, శాంసంగ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి కరీంనగర్ పరిసరాల్లో యువకులు, హైవే దాబాల వద్ద లారీ డ్రైవర్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై గతంలోనూ గంజాయి కేసులు నమోదై ఉండటంతో హిస్టరీ షీట్ తెరిచినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్‌కు తరలిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ ఏ. లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వారిని పోలీస్ కమిషనర్ గౌస్ అలం, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు.
=========================
1.140 కిలోల గంజాయి స్వాధీనం.. నిందితుడి అరెస్ట్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి
RELATED ARTICLES

