ePaper
Friday, November 13, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల్లో చేపల వేట 61 రోజుల నిషేధం

నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల్లో చేపల వేట 61 రోజుల నిషేధం

📰 Generate e-Paper Clip

నరసరావుపేట,అర్జున్ సమాచారం :

చేపల పునరుత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాగార్జునసాగర్, కె.ఎల్. రావు పులిచింతల జలాశయాల్లో జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుందని పల్నాడు జిల్లా మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఓ. ఎం.ఎస్. నెం.776 (ఆహార & మత్స్యశాఖ) తో పాటు తదుపరి ఉత్తర్వుల మేరకు ప్రతి ఏడాది ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కాలంలో జలాశయాల్లో చేపలు గుడ్లు పెట్టే దశలో ఉండటంతో వాటి పునరుత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిషేధ కాలంలో ఎవరూ జలాశయాల్లో చేపల వేట చేపట్టరాదని, నిబంధనలను ఉల్లంఘించి వేట నిర్వహించినట్లయితే సంబంధిత లైసెన్సులను రద్దు చేయడంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు నిషేధ కాలాన్ని పూర్తిగా పాటించి చేపల సంపద పరిరక్షణకు సహకరించాలని మత్స్యశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
====================================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!