నరసరావుపేట,అర్జున్ సమాచారం:
:
నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన వివిధ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులను మంజూరు చేసి సహకరించాలని కోరారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతిపాదనల దశలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు, ఆటోనగర్ నిర్మాణం, కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, గ్రామీణ రహదారుల అభివృద్ధి, నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు పలు పైలట్ ప్రాజెక్టుల గురించి సమగ్రంగా వివరించినట్లు తెలిసింది. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకమని, వీటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
==============================
నియోజకవర్గ అభివృద్ధి పనులకు సహకరించాలని ముఖ్యమంత్రిని కోరిన ఎమ్మెల్యే అరవింద బాబు
RELATED ARTICLES

