హైదరాబాద్.అర్జున్ సమాచారం:
5 కోట్ల 30 లక్షల గుడ్లను ఉత్పత్తి చేసి విద్యార్థులకు, యువతకు పౌష్టిక ఆహారాన్ని అందించడంలో పాల్ట్రీ వ్యాపారులు భాగస్వాములు అవుతున్నారు . పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు ఎదురవుతున్న సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలని ప్రతిపాదనలు అందించారు. గ్రామ పంచాయతీలలో పౌల్ట్రీ నిర్మించుకోవడానికి సింగిల్ విండో విధానంలో అనుమతులు అందించేలా ప్రభుత్వం మార్పులు తీసుకొస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
బుధవారం అయన పౌల్ట్రీ ఇండియా ఎక్స్ పో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎల్ నినో కరువు పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లకు సరిపడా సన్నంబియ్యం ప్రభుత్వం దగ్గర నిల్వలు ఉన్నాయి . కానీ పౌల్ట్రీకి సంబంధించి మొక్కజొన్నల కొరత ఉందని మా దృష్టికి వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించేలా చూడాలని మా మంత్రులను ఆదేశిస్తున్నా . వ్యవసాయ కూలీలకు, రైతులకు ఉపాధి కలిగించే పరిశ్రమ పౌల్ట్రీ . పౌల్ట్రీ ఇండస్ట్రీ కేవలం కోళ్లను, గుడ్లను ఉత్పత్తి చేయడమే కాదు.. రైతుల ఆర్ధిక శక్తిని బలోపేతం చేస్తుంది . ఈ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
ఒడిదుడుకులను తట్టుకుని పరిశ్రమలో నిలబడటం, పరిశ్రమను కాపాడటాన్ని ప్రభుత్వం అభినందిస్తోంది . పౌల్ట్రీని కూడా ఒక ప్రాధాన్యత రంగంగా గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా పాలసీలను రూపొందిస్తాం . కాలానుగుణంగా, క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా పాలసీలను ఇంప్రూవ్ చేసుకుంటాం. పాలసీలు, ప్రభుత్వ నిర్ణయాల విషయంలో మీకు చింత అవసరం లేదు. తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదు. గత ప్రభుత్వాలు రూపొందించిన మంచి పాలసీలను కొనసాగిస్తూనే, కొత్త పాలసీలను తీసుకొస్తున్నాం . 2047 నాటికి తెలంగాణకు 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని అన్నారు.

