హైదరాబాద్,అర్జున్ సమాచారం:
రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై, హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకొని, వారికి అత్యుత్తమ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
తరువాత వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని, ఆయన ఆరోగ్య సంరక్షణకు అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామని భరోసా ఇచ్చారు.
పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి పొంగులేటి
RELATED ARTICLES

