ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeఅంతర్జాతీయంవిజయవాడపేదల ఆత్మగౌరవానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న పట్టాభిషేకం పేదలకు పట్టాభిషేకం లో సీఎం చంద్రబాబు

పేదల ఆత్మగౌరవానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న పట్టాభిషేకం పేదలకు పట్టాభిషేకం లో సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

విజయవాడ,అర్జున్ సమాచారం:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది. ప్రజలు వేసిన ప్రతి ఓటుకూ న్యాయం చేస్తున్నాం. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ జెట్ స్పీడుతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోందని అన్నారు.
విశాఖపట్నంలో 28 వేల మందికి, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు, ఇప్పుడు విజయవాడలో 26 వేల మంది కుటుంబాలకు పట్టాలు ఇస్తున్నాం. మొత్తం కలిపి 60 వేల మంది పేదలకు పట్టాలు ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. రూ.52 వేల కోట్ల విలువైన భూముల్ని పేదలకు ఇవ్వటం సంతోషంగా ఉంది. పేదలకు జరుగుతున్న పట్టాభిషేకం ఇది. విజయవాడలో ఇస్తున్న భూముల విలువ రూ.28,112 కోట్లుగా ఉంది. ప్రతి ఒక్కరికీ సగటున 130 చదరపు గజాల స్థలం వచ్చింది. ఒక్కో స్థలం విలువ రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ ఉంటుంది. ఇదే పేదల ఆత్మగౌరవానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న పట్టాభిషేకం. దశాబ్దాలుగా పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి చలించి మీ స్థలాలకు హక్కుల కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పేదలకు పట్టాలు వచ్చేలా కృషి చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు అభినందనలు తెలియచేస్తున్నా. గత పాలనలో ఐదేళ్ల పాటు విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం, ఇబ్బందులు ఎదుర్కోంటున్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం. పేదలకు కూడూ, గూడు, గుడ్డ అన్నది ఎన్టీఆర్ నినాదం అందులో భాగంగా 12,007 మందికి హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాల స్థలానికి పేదలకు హక్కులు కల్పించాం. ఇది మీ వారసత్వ హక్కు.  భవిష్యత్తు కోసం జాగ్రత్తగా వీటిని కాపాడుకోవాలని అందరికీ పిలుపునిస్తున్నాను. దశాబ్దాలుగా ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాం. విశాఖ, వట్టిచెరుకూరు, కంగుమంది, కైకలూరు, అమలాపురం లాంటి చోట్ల ఉన్న ఈ తరహా సమస్యల్ని పరిష్కరించి పట్టాలు ఇచ్చాం. 2019-24లో గత పాలకులు ప్రతీ ఇంట్లోనూ ఆస్తుల వివాదాలు సృష్టించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై వారి బొమ్మలేసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో ఇబ్బందులు సృష్టించారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. సర్వేరాళ్లపై బొమ్మలు వేసుకోడానికి రూ.800 కోట్లు ఖర్చు చేశారు. ఆ డబ్బులు ఉంటే పేదలకు మరింత సంక్షేమం జరిగేది. రాష్ట్రంలో భూములన్నిటిని రీసర్వే చేసి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఎలాంటి వివాదాలు లేని కొత్త వ్యవస్థను తీసుకువచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!